Telugu Proverbs

౧. ఆరు నెలలు సావాసం చేస్తే వీళ్ళు వాళ్ళవుతారు.
౨. ఆడలేక మద్దెల వోడు అన్నట్లు
౩. ఆదిలోనే హంస పాదు.
౪. ఏమి లేని ఎడారిలో ఆముదం చెట్టే మహా వృక్షం.
౫. ఆకలి రుచి ఎరగడు నిద్ర సుఖమెరగదు
౬. ఆలస్యం అమృతం విషం.
౭. ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లు.
౮. ఆరే దీపానికి వెలుగు ఎక్కువ
౯. ఆరోగ్యమే మహ భాగ్యం
౧౦ ఆవు చేను మేస్తే దూడ గట్టు మేస్తుందా.
౧౧ అభద్ధం ఆడినా అతికినట్లుండాలి
౧౨. అడగందే అమ్మయినా అన్నం పెట్టదు.
౧౩. అడిగే వాడికి చెప్పేవాడు లోకువ
౧౪. ఏ ఎండకు ఆ గొడుగు!
౧౫. అగ్నికి ఆయువు తోడయినట్లు!
౧౬. ఐశ్వర్యం వస్తే అర్ధ రాత్రి గొడుగు పట్టమనేవాడు!
౧౭. అందితే జుట్టు అందకపోతే కాలు!
౧౮. అంగట్లో అన్నీ ఉన్న అల్లుడు నోట్లో శని ఉన్నట్లు!
౧౯. అన్నపు చొరవేగానీ అక్షరపు చొరవు లేదు!
౨౦. అంత్య నిష్టూరం కన్నా ఆది నిష్టూరం మేలు!


NEXT >>