౨౧. అప్పు చేసి పప్పుకూడు
౧౨. అతి రహస్యం భాట్టబయలు
౨౩. అయ్యవారు వచ్చేవరకు అమ్మవాస్య ఆగుతుందా!
౨౪. బతికుంటే బలుసాకు తినవచ్చు.
౨౫. బెల్లం కొట్టిన రాయిలా!
౨౬. బూడిదలో పోసిన పన్నీరు
౨౭. చేదస్తపు మొగుడు చెపితే వినడు, గిచ్చితే ఏడుస్తాడు.
౨౮. చాప కింద నీరులా
౨౯. చదువవస్తే ఉన్న మతి పోయినట్లు
౩౦. చదువు రాని వాడు వింత పశువు
౩౧. చేతకానమ్మకి చేష్టలు ఎక్కువ!
౩౨. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు
౩౩. చక్కనమ్మ చిక్కిన అందమే!
౩౪. చెరపకురా చెడేవు
౩౫. చీకటి కొన్నాళ్ళు, వెలుగు కొన్నాళ్ళు!
౩౬. చెరువుకి నీటి ఆశ నీటికి చెరువు ఆశ
౩౭. చెవిటివాడి చెవిలో శంఖం ఊదినట్లు
౩౮. చింత చచ్చినా పులుపు చావలేదు
౩౯. చింతకాయలు అమ్మటానికి సిరిమానం వస్తే ఆ వంకర టింకరవి ఏమి కాయలని అడుగుతుందట
<<PREV NEXT>>