silly points telugulo

Silly points. (తెలుగు లో)
Part1:
  • అణు గడియారాలు ఎంత కచ్చితంగా పనిచేస్థాయంటే... కోటి డెబ్బై లక్షల సంవత్సరాలకు ఒక సెకన్ మాత్రమే తేడా వస్తుంది. 
  • అమెరికా తొలి అధ్యక్షుడు జార్జి వాషింగ్టన్ వాడిన నోట్ బుక్ ఇప్పటికీ మ్యుజియం లో ఉంది. అందులో మొదటి పేజిలో ఆయన రాసిందేంటో తెలుసా ... బీర్ తయారి ఎలా అని!
  • ప్రపంచంలో అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతం చిలీలోని అరికా, అక్కడ ఎడాదికి ౦.76 మీ.మీ. వర్షం పడుతుంది. అక్కడపడే వర్షం తో టీ కప్పు నిండాలంటే కనీసం వందేళ్ళు పడుతుంది.
  • భూమి లోతుల్లో ఉండే పెద్ద పెద్ద జంతువులు పోరాటం చేసుకోవడం వల్లే భూకంపాలు సంభవిస్తాయని పురాతన గ్రీకులు భావించేవారు.
  • వేళ్ళు విరుచుకోవడాన్ని ఆంగ్లం లో ఫిల్లిప్ (Fillip) అంటారు.
  • సెకనులో వందకోట్ల వంతులో కాంతి పయనించే దూరం ... ౩౦ సెం.మీ. ఏడాదికి ఇది 9,460,800,000,000 కి.మీ.
  • చేతులకో కాళ్ళకో ఆరువేళ్ళు ఉండటాన్ని 'హెక్సాడెక్టిలిజం' అంటారు.
  • జంతువుల్లోకెల్లా అత్యంత అధిక శబ్దం తో అరిచే జీవి డాల్ఫిన్. దీని అరుపు 188 డెసిబుల్స్ ఉంటుంది.
  • ఆవులక్కుడా మనలాగానే 32 దంతలుంటాయి.
  • ప్రపంచంలో మొట్టమొదటి ఫోన్ నంబర్ల జాబితా పుస్తకాన్ని కనెక్టికట్ రాష్ట్రంలోని న్యూహబెన్ లో  1878 లో ప్రచురించారు. ఆ పుస్తకంలో పేజిల సంఖ్య 1 . ఫోన్ నంబర్ల సంఖ్య 50 .
  • సరీసృపాలకు చెమటగ్రంధులు ఉండవు.
Part 2:
  • హవాయిదీవుల్లో ఒక నగరం పేరులో అన్నీ అచ్చు అక్షరాలే ఉంటాయి (Aiea).
  • స్పెయిన్ రాజధాని మాడ్రిడ్ తప్ప యూరప్ లోని అన్ని దేశాల రాజధానుల్లోనూ ఏదో ఒక నది ప్రవహిస్తుంది.
  • బ్రిటన్ లో అత్యధిక భూమిని కలిగి ఉన్న వ్యక్తి ఎలిజబెత్ మహారాణి.
  • గోరు ఫై భాగంలో తెల్లగా ఉండే ప్రదేశాన్ని 'లూనూలా' అంటారు.
  • ఎగసిన అలలను ఆంగ్లంలో 'స్ప్రింగ్ టైడ్స్' అనీ పడిన అలలను 'నీప్ టైడ్స్' అని అంటారు.
  • 'టన్ను' అంటే అమెరికా లో 907.2  కిలోలు. అదే బ్రిటన్ లో 1016  కేజిలు. సరిగ్గా వెయ్యి కిలోలు ఉంటే దాన్ని ఎక్కడయినా సరే 'మెట్రిక్ టన్' గా వ్యవహరిస్తారు.
From Eeenadu weekly book